‘ప్రకాశం’లో మౌలిక వసతుల అగ్రగామి

Jul 1,2024 20:43
'ప్రకాశం'లో మౌలిక వసతుల అగ్రగామి

మాట్లాడుతున్న కంచర్ల రామయ్య
‘ప్రకాశం’లో మౌలిక వసతుల అగ్రగామి
ప్రజాశక్తి -కందుకూరు :మౌలిక వసతుల కల్పనలో అగ్రగామిగా ఉండాలన్న లక్ష్యంతో తాము కాలేజీని నిర్వహిస్తూ విద్యార్థులు,తల్లిదండ్రుల మన్న నలు పొంద ుతున్నామని ప్రకాశం ఇంజినీరింగ్‌ కాలేజీ కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య పేర్కొన్నారు. సోమవారం తొలి సంవత్సరం డిప్లమో తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్రమశిక్షణ జీవంగా గత 20 సంవత్సరాల నుండి కాలేజీ నిర్వహించి సత్ఫలితాలను సాధించడం తమకు సగర్వంగా ఉందన్నారు. కోర్సు సర్టిఫికెట్‌ ఒక చేత, ఉద్యోగ పత్రం మరో చేత తమ లక్ష్యమని రామయ్య స్పష్టం చేశారు. ఇంజి నీరింగ్‌లో ఈ లక్ష్యం పరిపూర్ణంగా కొన సాగుతుందన్నారు. క్రమశిక్షణతో విద్యాభ్యాసం కొనసాగించే ప్రతి డిప్లమో విద్యార్థికి ప్రకాశం ఉద్యోగ భరోసా లేదా ఉన్నత విద్యకు హామీ ఇస్తుందన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సి.హెచ్‌.రవికుమార్‌ మాట్లాడుతూ యాజమాన్యం ఎల్లవేళలా విద్యార్థుల ప్రవర్తన, యోగక్షేమాలు పరిశీలిస్తూ ఉంటుందన్నారు. కోటి విద్యలు కూటికే అన్న సామెతను ఉద్యోగానికే అని మార్చిన ఘనత ప్రకాశం కే దక్కిందన్నారు. ఫస్ట్‌ ఇయర్‌ డిప్లమో విద్యార్థుల ఇన్‌ చార్జీ సులోచన మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు దీటుగా సాంకేతిక విద్య నేర్చుకోవడంతోపాటు ఉపాధి అవకాశాలు పుష్కలంగా పాలిటెక్నిక్‌ లో ఉంటాయని పేర్కొన్నారు. డిప్లమో అన్ని కోర్సుల ఇన్‌ చార్జి గురు శేషు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రవర్తనను, నడవడికను పరిశీలించే కార్యక్రమం ప్రకాశంలో ఉంటుందన్నారు. హాస్టల్‌ విద్యార్థులకు స్టడీ అవర్‌ నిత్య కృత్యమని తెలిపారు. తొలుత ఆఫీసులో పూజా కార్యక్రమాన్ని డి కొండలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.

➡️