ఇళ్ల స్థలాలివ్వాలని వినతి

వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:మండలంలోని గబ్బాడ గ్రామ పంచాయతీ నిరుపేద దళిత కుటుంబాలకు జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని బుధవారం టీడీపీ నాయకులు ఆర్డీవో కార్యాలయ ఏఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత నాయకులు నేతల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అర్హులైనప్పటికీ పేద దళితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయలేదన్నారు. గ్రామంలో క్షేత్ర స్థాయిలో విచారణ చేసి దరఖాస్తు చేసిన అర్హులైన వారందరికి జగనన్న ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఈర్లె రాజుబాబు, టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు పెట్ల అప్పలనాయుడు, ఉప సర్పంచ్‌ మాకిరెడ్డి రాజునాయుడు, టీడీపీ ఎస్సీ ప్రధాన కార్యదర్శి కోడి శ్రీనివాసరావు, రెల్లి సంఘం రాష్ట్ర నాయకులు యర్రంశెట్టి పాపారావు, మాలమహానాడు నాయకులు గాతాడ సహదేముడు పాల్గొన్నారు.

➡️