ఉపాధి హామి పనులు ప్రారంభించాలి

Feb 1,2024 23:16
ó కూలీలతో కలిసి మాట్లాడుతున్న అప్పలరాజు

 

 

ప్రజాశక్తి -నక్కపల్లి:జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు ప్రారంభించి కూలీలకు పనులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు, మండల కన్వీనర్‌ ఎం.రాజేష్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని గునుపూడి గ్రామంలో గురువారం ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండలంలోని తీవ్ర కరువు నెలకొని ఉందని, దీంతో కూలీలకు చేయడానికి పనులు లేక పస్తులతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి, కూలీలు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మండలంలో అన్ని గ్రామాల్లోనూ పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గునిపూడి మాజీ సర్పంచ్‌ మాసా జోగారావు, వాతాడ అప్పారావు, మాసా యేసుబాబు, పల్లా అప్పారావు పాల్గొన్నారు.

➡️