కాంగ్రెస్‌ నేతల ప్రచారం

Jan 20,2024 00:13
ప్రచారం చేపడుతున్న నేతలు

ప్రజాశక్తి-మాడుగుల:గిరిజన గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం ప్రారంభించింది. శుక్రవారం మండలంలోని రామచంద్రపురం గిరిజన గ్రామంలో మాడుగుల నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ కోఆర్డినేటర్‌ పడాల కొండలరావు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్‌ కొండలరావు మాట్లాడుతూ, ఈనెల 21న విజయవాడలో పిసిసి అధ్యక్షురాలు వైయస్‌ షర్మిల ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బుడబండి రాజు, నియోజకవర్గ యువజన నాయకుడు మైలపల్లి యేసు రాజు, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మై చర్ల జగ్గారావు, కింతలి జగ్గారావు, పిల్లా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️