16న బంద్‌ను జయప్రదం చేయాలి

Jan 29,2024 00:11
మాట్లాడుతున్న గోవిందరావు

ప్రజాశక్తి -కొత్తకోట:పెద్దేరు పంట కాలవల ఆధునీకరణ పనులు తక్షణమే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ పిబ్రవరి 16న తలపెట్టిన రావికమతం బంద్‌ ను జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం, రైతు సంఘం ప్రతినిధులు కె. గోవిందరావు, రోబ్బ నాగరాజు తదితరులు కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో మాడుగులు, చోడవరం నియోజ కవర్గాల పరిధిలో పెద్దేరు ఎడమ కాలువ ఆధునీకరణ కోసం గత ఏడాది కిందట ప్రభుత్వం జీవో 120 విడుదలతో పాటు సుమారు రూ.84.40 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. నిధులు విడుదల చేసి ఏడాది కావచ్చినా ఆధునికరణ పనులు మాత్రం ప్రారంభించలేదని విమర్శించారు.గత ఏడాది వర్షాలు లేక బుడ్డిబంద, కవగుంట, కొమిరి, మచ్చ పురం, చిన్నపాచిల రెవెన్యూ పరిధిలో రైతులు పెట్టుబడి పెట్టిన పంటలన్నీ ఎండి పోయాయాని ఆవేదన వ్యక్తం చేశారు. బంద్‌ లో వి.మాడుగుల, బుచ్చయ్యపేట, రావికమతం మండలాల్లో ప్రజా సంఘాలు, రైతు, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు పాల్గొవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు మహిళా సంఘం నాయకులు రబ్బ వరహాలమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️