సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 

Dec 20,2023 14:17 #anakapalle district
samagra siksha employees strike anp

ప్రజాశక్తి – కశింకోట : కశింకోట లో విద్యాశాఖ-సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు తమ హక్కుల సాధన కొరకు బుదవారం  కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో పనిచేస్తున్న సిఆర్ఎంటిలు , డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్,పిటిఐలు నిరసన  చేశారు.  సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత సకాలంలో జీతాలు వంటివి అమలు చేయాలని మొత్తం 15 డిమాండ్ లు పరిష్కారం కోసం నుంచి సమ్మె బాట పడుతున్నట్లు తెలిపారు  మండల అధ్యక్షులు డి.లక్ష్మణ, పందిరి సత్తిబాబు  ఝాన్సీ, రామలక్ష్మి, సురేష్, సత్యారావు, సూర్యదాసు  సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️