పెండింగ్ జీతాలేవి : విఓఎలు

Feb 10,2024 14:23 #anakapalle district, #VOA
voa pending wages

ప్రజాశక్తి-దేవరాపల్లి : విఓఎ లకు ప్రభుత్వం ఇచ్చిన హామిలు వెంటనే అమలు చేయాలని పెండింగ్ జీతాలు వెంటనే చేల్లించాలని విఓఎ సంఘం జిల్లా అద్యక్షులు కె సూరిబాబు డిమాండ్ చేసారు శనివారం దేవరాపల్లి సిఐటియు కార్యాలయంలో జి రాము అద్యక్షతన విఓఎ లు విస్తృత స్థాయి సమావేశం జరిగింది అనంతరం వారు మాట్లాడారు, కాలపరిమితి సర్కులర్ ను వెంటనే రద్దు, చేయాలని హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలని సిసీ పోస్టులు భర్తీ సందర్భంగా విఓఎ కు ప్రమోషన్లు సౌకర్యం కల్పించాలని వివో ఏ లు ఏ కారణంతో చనిపోయిన గ్రూప్ ఇన్సూరెన్స్ 7 లక్షలు ఇవ్వాలన్నారు.  పాత బకాయిలు 2.24 కోట్లు విడుదల చేయాలని 60 సంవత్సరాలు నిండినటువంటి వారికి నిలుపుదల చేసిన వేతనాలను వెంటనే చెల్లించాలని గ్రామ సంఘం నుండి వి ఓ ఏ ల కు వేతనాలు ఇవ్వడానికి నిబంధనలు పెట్టే అధికారులు పై చర్యలు తీసుకోవాలని గ్రామ సంఘం నుండి 2000 రూపాయలు ప్రతి వివో ఏ తీసుకునేలాగా చర్యలు చేపడాతామని తెలియజేశారు. ఇందుకోసం గ్రామ సంఘం ఆదాయాన్ని మండల సమాఖ్యలు చెల్లించాల్సినవి తప్ప ఇతర ఏరక మైన వాటి కోసం గ్రామ సంఘం అమౌంటును మండల సమాఖ్యలకు చెల్లించ కూడదని అలా చేస్తామని చెప్పిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ చెప్పడం జరిగిందని దీనిని వెంటనే అమలు చేయాలని కోరారు 14 సంఘాలు లోపు ఉన్నటువంటి వివోలలో పనిచేస్తున్న వివోఏలకు వేతనాలు చేల్లించాలని కోరారు. గుర్తింపు కార్డులు వెంటనే చేల్లించాలని ప్రభుత్వం అమలు చేస్తామని చేప్పిన ఈ డిమాండ్లు పరిష్కారం వెంటనే చేయాలని కోరారు. లెదంటే పెద్ద ఎత్తున అందోళన చేస్తామని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో సంఘం కోశాధికారి స్రుజన అప్పారావు, టి అప్పారావు, లీలా, ఆర్ వెంకటి తోపాటు వ్వవసాయకార్మికసంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న, అదికసంఖ్యలో విఓఎ లు పాల్గొన్నారు.

➡️