అధ్యాపకులు సమాజ నిర్మాణానికి మూలస్తంభాలు

అధ్యాపకున్ని సన్మానించి, జ్ఞాపికను అందిస్తున్న విసి రంగజనార్ధన

       అనంతపురం : అధ్యాపకులు సమాజ నిర్మాణానికి మూల స్తంభాలని అనంతపురం జెఎన్‌టియు ఉపకులపతి ఆచార్య రంగ జనార్ధన తెలిపారు. బుధవారం నాడు అనంతరం జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో జెఎన్‌టియు యూనివర్సిటీ స్థాయి అధ్యాపకులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యూనివర్సిటీ కళాశాలలు, ప్రయివేటు కళాశాలల్లో ఉత్తమ అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, వర్సిటీ ఉమెన్‌ ఎంపవర్మెంట్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్స్‌, వాలంటీర్స్‌, రాష్ట్ర ప్రభుత్వ బెస్ట్‌ టీచర్స్‌, పేటెంట్స్‌, యూనివర్సిటీ అవార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో అధ్యాపకులు పాత్ర ఎంతోకీలకం అయినదన్నారు. అధ్యాపకులు వారి దగ్గరున్న సమాచారాన్ని వర్శిటీకి అందించాలని కోరారు. ఈ సమాచారం ఎన్‌ఐఆర్‌ఫ్‌ ర్యాంకింగ్‌, న్యాక్‌కు ఉపయోగపడుతుందని తెలిపారు. దీని వల్ల మెరుగైన గ్రేడింగ్‌ సాధించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. అనంతరం అవార్డు గ్రహీతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌వి.సత్యనారాయణ , వైస్‌ప్రిన్సిపాల్‌, యూనివర్సిటీ డైరెక్టర్లు, కళాశాల విభాగాల అధిపతులు లు, అధ్యాపకులు, భోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️