ఆంగన్‌వాడీల ఆగ్రహం.. ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడి

Dec 28,2023 08:57

అనంతపురంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంటి ముంద ఆందోళన నిర్వహిస్తున్న అంగన్‌వాడీలు

           అనంతపురం కలెక్టరేట్‌ : అంగన్‌వాడీలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మె మరింత ఉధృతం అయ్యింది. వేతనాల పెంపుదల, గ్రాట్యూటీ అమలు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ సాధన కోసం చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. ఆందోళనల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేల నివాసాలు, కార్యాలయాలను బుధవారం నాడు ముట్టడించారు. పోలీసులు అడ్డుకున్నా వారిని ఎదిరించి ఎమ్మెల్యేల నివాసాల వద్ద నిరసన తెలిపారు.

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంటిని అంగన్‌వాడీలు ముట్టడించారు. కృష్ణకళామందిరం నుంచి అంగన్‌వాడీలు, సిఐటియు నాయకులు ర్యాలీగా కోర్టు రోడ్డు మీదుగా ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. ఆయన ఇంటి వద్ద బైటాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వీరిని అడ్డుకునేందుకు యత్నించడంతో అంగన్‌వాడీలు ప్రతిఘటించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత వారికి వద్దకొచ్చి సమస్యలను విన్నారు. కార్మికుల పోరాట మార్గాన్ని తాను గౌరవిస్తానని అంగన్‌వాడీల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. అంగన్‌వాడీల ఆందోళనలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే దృష్టికి అంగన్‌వాడీల సమస్యలను తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అంగన్‌వాడీలు కోరుతున్నారని ఆ మేరకు వాటిని అమలు చేయాలని గేయానంద్‌ కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణతో అంగన్‌వాడీలు పాల్గొన్నారు. కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీచరణ్‌ ఇంటిని అంగన్‌వాడీలు ముట్టడించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మంత్రి నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు అంగన్‌వాడీలు, సిఐటియు నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తమ సమస్యలను వినే ఓపిక కూడా ప్రజాప్రతినిధులకు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా యూనియన్‌ అధ్యక్షురాలు శకుంతలతో పాటు పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి క్యాంప్‌ కార్యాలయాన్ని అంగన్‌వాడీలు ముట్టడించారు. అనంతపురంలోని రామ్‌నగర్‌ 80 అడ్డుగుల రోడ్దువద్ద ఉన్న ఆయన కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో పీఏకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర న్యూ కమిటీ కార్యదర్శి ఆర్‌వి.నాయుడు, సిఐటియు జిల్లా నాయకులు మన్నీల రామాంజినేయులు, శ్రీసత్యసాయి జిల్లా కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి లింగన్నతో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నివాసాన్ని అంగన్‌వాడీలు ముట్టడించారు. అనంతపురంలోని జన్మభూమి రోడ్డులో ఉన్న ఆమె నివాసాన్ని పెద్ద ఎత్తున అంగన్‌వాడీలు ముట్టడించారు. ఎమ్మెల్యే సమస్యలను వినేందుకు బయటకు రాకపోవడంతో అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడే రోడ్డుపై బైటాయించి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, ఏపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తరిమెల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసం వద్ద అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సిఐటియు నాయకులు జగన్‌ మహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు నాగిరెడ్డి తదితరులు వీరికి మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వినతి పత్రాన్ని అందజేసేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రాన్ని అందజేశారు. అంగన్‌వాడీలు ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్తున్న నేపథ్యంలో సిఐ శంకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడ పోలీసు పహారా ఏర్పాటు చేశారు. దీనిపై అంగన్‌వాడీలు భగ్గుమన్నారు. తమ సమస్యలను పరిష్కరించమంటే ఇలా నిర్భాందాలు విధించడం ఏమిటంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాయదుర్గంలో శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి నివాసం వద్ద అంగన్‌వాడీలు గంటకు పైగా ధర్నా చేపట్టారు. ముందుగా పట్టణంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు ర్యాలీ చేపట్టారు. ఆర్‌అండ్‌ బి అతిథి గహం నుంచి కనేకల్‌ రోడ్డు మీదుగా ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ బైటాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే పీఏకు అందజేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.బాల రంగయ్య, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున, సిపిఎం సీనియర్‌ నాయకులు నాగరాజు అంగన్‌వాడీలు పాల్గొన్నారు. గుంతకల్లు పట్టణంలో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి నివాసాన్ని అంగన్‌వాడీలు ముట్టడించారు. దీక్షా శిబిరం నుంచి అంగన్‌వాడీలు ర్యాలీగా వెళ్తుండగా అప్పటికే పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. సిఐటియు నాయకులు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పోలీసులతో వాగ్వాదం చేశారు. ఎమ్మెల్యే ఇంటి వద్దనే రోడ్డుపై బైటాయించారు. ఎమ్మెల్యేకు సమస్యను చెబుతామని శాంతి యుతంగా వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యే కూతురు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ నైరుతిరెడ్డి అంగన్‌వాడీల వద్దకు వచ్చి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, నాయకులు దాసరి శ్రీనివాసులు, మారుతీ ప్రసాద్‌, తిమ్మప్ప, సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కసాపురం రమేష్‌, సాకే నాగరాజు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. ఉరవకొండలోని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పార్టీ కార్యాలయాన్ని అంగన్‌వాడీలు ముట్టడించారు. ప్రధాన రహదారి గుండా అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి టిడిపి కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ ఎమ్మెల్యే లేకపోవడంలో టిడిపి నాయకులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఉరవకొండ మండల కన్వీనర్‌ మధుసూదన్‌, జిల్లా కమిటీ సభ్యులు రంగారెడ్డి, జ్ఞానమూర్తి, వెంకటేశులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇక వజ్రకరూరు మండలంలో ఎమ్మెల్సీ శివరామిరెడ్డిని ఆయన స్వగ్రామం కొనకొండ్లలో అంగన్‌వాడీలు కలిసి వినతిపత్రం అందజేశారు.అనంతపురంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంటి ముంద ఆందోళన నిర్వహిస్తున్న అంగన్‌వాడీలుఆంగన్‌వాడీల ఆగ్రహం.. ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడి అనంతపురం కలెక్టరేట్‌ : అంగన్‌వాడీలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మె మరింత ఉధృతం అయ్యింది. వేతనాల పెంపుదల, గ్రాట్యూటీ అమలు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ సాధన కోసం చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. ఆందోళనల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేల నివాసాలు, కార్యాలయాలను బుధవారం నాడు ముట్టడించారు. పోలీసులు అడ్డుకున్నా వారిని ఎదిరించి ఎమ్మెల్యేల నివాసాల వద్ద నిరసన తెలిపారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంటిని అంగన్‌వాడీలు ముట్టడించారు. కృష్ణకళామందిరం నుంచి అంగన్‌వాడీలు, సిఐటియు నాయకులు ర్యాలీగా కోర్టు రోడ్డు మీదుగా ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. ఆయన ఇంటి వద్ద బైటాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వీరిని అడ్డుకునేందుకు యత్నించడంతో అంగన్‌వాడీలు ప్రతిఘటించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత వారికి వద్దకొచ్చి సమస్యలను విన్నారు. కార్మికుల పోరాట మార్గాన్ని తాను గౌరవిస్తానని అంగన్‌వాడీల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. అంగన్‌వాడీల ఆందోళనలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే దృష్టికి అంగన్‌వాడీల సమస్యలను తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అంగన్‌వాడీలు కోరుతున్నారని ఆ మేరకు వాటిని అమలు చేయాలని గేయానంద్‌ కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణతో అంగన్‌వాడీలు పాల్గొన్నారు. కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీచరణ్‌ ఇంటిని అంగన్‌వాడీలు ముట్టడించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మంత్రి నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు అంగన్‌వాడీలు, సిఐటియు నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తమ సమస్యలను వినే ఓపిక కూడా ప్రజాప్రతినిధులకు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా యూనియన్‌ అధ్యక్షురాలు శకుంతలతో పాటు పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి క్యాంప్‌ కార్యాలయాన్ని అంగన్‌వాడీలు ముట్టడించారు. అనంతపురంలోని రామ్‌నగర్‌ 80 అడ్డుగుల రోడ్దువద్ద ఉన్న ఆయన కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో పీఏకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర న్యూ కమిటీ కార్యదర్శి ఆర్‌వి.నాయుడు, సిఐటియు జిల్లా నాయకులు మన్నీల రామాంజినేయులు, శ్రీసత్యసాయి జిల్లా కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి లింగన్నతో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నివాసాన్ని అంగన్‌వాడీలు ముట్టడించారు. అనంతపురంలోని జన్మభూమి రోడ్డులో ఉన్న ఆమె నివాసాన్ని పెద్ద ఎత్తున అంగన్‌వాడీలు ముట్టడించారు. ఎమ్మెల్యే సమస్యలను వినేందుకు బయటకు రాకపోవడంతో అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడే రోడ్డుపై బైటాయించి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, ఏపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తరిమెల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసం వద్ద అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సిఐటియు నాయకులు జగన్‌ మహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు నాగిరెడ్డి తదితరులు వీరికి మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వినతి పత్రాన్ని అందజేసేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రాన్ని అందజేశారు. అంగన్‌వాడీలు ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్తున్న నేపథ్యంలో సిఐ శంకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడ పోలీసు పహారా ఏర్పాటు చేశారు. దీనిపై అంగన్‌వాడీలు భగ్గుమన్నారు. తమ సమస్యలను పరిష్కరించమంటే ఇలా నిర్భాందాలు విధించడం ఏమిటంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాయదుర్గంలో శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి నివాసం వద్ద అంగన్‌వాడీలు గంటకు పైగా ధర్నా చేపట్టారు. ముందుగా పట్టణంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు ర్యాలీ చేపట్టారు. ఆర్‌అండ్‌ బి అతిథి గహం నుంచి కనేకల్‌ రోడ్డు మీదుగా ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ బైటాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే పీఏకు అందజేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.బాల రంగయ్య, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున, సిపిఎం సీనియర్‌ నాయకులు నాగరాజు అంగన్‌వాడీలు పాల్గొన్నారు. గుంతకల్లు పట్టణంలో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి నివాసాన్ని అంగన్‌వాడీలు ముట్టడించారు. దీక్షా శిబిరం నుంచి అంగన్‌వాడీలు ర్యాలీగా వెళ్తుండగా అప్పటికే పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. సిఐటియు నాయకులు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పోలీసులతో వాగ్వాదం చేశారు. ఎమ్మెల్యే ఇంటి వద్దనే రోడ్డుపై బైటాయించారు. ఎమ్మెల్యేకు సమస్యను చెబుతామని శాంతి యుతంగా వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యే కూతురు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ నైరుతిరెడ్డి అంగన్‌వాడీల వద్దకు వచ్చి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, నాయకులు దాసరి శ్రీనివాసులు, మారుతీ ప్రసాద్‌, తిమ్మప్ప, సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కసాపురం రమేష్‌, సాకే నాగరాజు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. ఉరవకొండలోని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పార్టీ కార్యాలయాన్ని అంగన్‌వాడీలు ముట్టడించారు. ప్రధాన రహదారి గుండా అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి టిడిపి కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ ఎమ్మెల్యే లేకపోవడంలో టిడిపి నాయకులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఉరవకొండ మండల కన్వీనర్‌ మధుసూదన్‌, జిల్లా కమిటీ సభ్యులు రంగారెడ్డి, జ్ఞానమూర్తి, వెంకటేశులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇక వజ్రకరూరు మండలంలో ఎమ్మెల్సీ శివరామిరెడ్డిని ఆయన స్వగ్రామం కొనకొండ్లలో అంగన్‌వాడీలు కలిసి వినతిపత్రం అందజేశారు.

➡️