ఆర్‌ఇఎఫ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

ఆర్‌ఇఎఫ్‌ నూతన కార్యవర్గం సభ్యులు

      అనంతపురం కలెక్టరేట్‌ : రిజర్వేషన్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌(ఆర్‌ఇఎఫ్‌) జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికైనట్లు ఆర్‌ఈఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.నాగభూషణ తెలిపారు. ఆదివారం లిటిల్‌ఫ్లవర్‌ స్కూల్‌లో ఆర్‌ఈఎఫ్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆర్‌ఈఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా మూడవసారి రాజావత్‌ నారాయణ నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్‌ఈఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షులుగా పి.కష్ణయ్య, ఎం.లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా టి.ఆదినారాయణ, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎన్‌.రాఘవేంద్రరావు, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా టి.రాజారమేష్‌, జిల్లా ప్రచార కార్యదర్శులుగా ఏ.రామగోపాల్‌, జయపాల్‌, జిల్లా ఉపాధ్యక్షులుగా బి.నారాయణప్ప, ఈ.రంగనాథ్‌, ఏ.నాగభూషణం, బి.ఆనంద్‌ నాయక్‌, వి.బాపూజీ నాయక్‌, ఆర్‌.మల్లికార్జున, వరదరాజులు, ఆర్‌.మహేష్‌ నాయక్‌, జిల్లా కార్యదర్శులుగా కోట్ల నారాయణస్వామి, కె.బాలాజీ నాయక్‌, జిల్లా ఆర్థిక కార్యదర్శిగా ఆర్‌.నాగేంద్ర, జిల్లా ఆడిటర్‌గా ఏ.కిష్టప్పలను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కమ్మన్న, జె.రామన్న, సురేష్‌, ఆర్‌ఈఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఓబులేశు, బి.రాజశేఖర్‌, ఉమాశంకర్‌, ఎం.శ్రీరాములు పాల్గొన్నారు.

➡️