ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సతీమణి ఉమాదేవమ్మకు కన్నీటి వీడ్కోలు

ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సతీమణి ఉమాదేవమ్మకు కన్నీటి వీడ్కోలు

ఉమాదేవమ్మకు నివాళులర్పిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్‌

 

ప్రజాశక్తి-ఉరవకొండ

శాసనమండలి ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి సతీమణి ఉమాదేవి అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామం వజ్రకరూరు మండలం కొనకొండ్లలో నిర్వహించారు. ఉమాదేవి పార్థీవదేహాన్ని హైదరాబాద్‌ నుంచి గురువారం సాయంత్రం కొనకొండ్లకు తీసుకొచ్చారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో అభిమానులు, నాయకులు భారీగా తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పోలీస్‌ శాఖ తగిన బందోబస్తు చేపట్టింది. నివాళులర్పించిన వారిలో మంత్రులు ఉషశ్రీచరణ్‌, గుమ్మనూరు జయరాం, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, సిద్ధారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌, ఎస్‌వి మోహన్‌రెడ్డి, రామిరెడ్డి, ప్రతాపరెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, మాజీమంత్రి, ఏఐసీసీ మెంబర్‌ రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పల్లె రఘునాథ్‌రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జెడ్సీ మాజీ ఛైర్‌పర్సన్‌ తోపుదుర్తి కవిత, ఉన్నారు.

➡️