ఎస్సీ, ఎస్టీ కులాలకు చట్టబద్ధత కల్పించాలి

కులగణన సదస్సులో మాట్లాడుతున్న కెవిపిఎస్‌ నాయకుడు జగ్గలి రమేష్‌

ప్రజాశక్తి-గుంతకల్లు

కులగణన కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఎస్సీ, ఎస్టీ కులాలకు చట్టబద్ధత కల్పించాలని కులగణన సదస్సులో కెవిపిఎస్‌ నాయకుడు జగ్గలి రమేష్‌ కోరారు. మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఛైర్‌పర్సన్‌ భవానీ అధ్యక్షతన కుల గణనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల గణనలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లపై రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులు పర్యవేక్షణ ఉండాలన్నారు. అధికారులు ఇళ్ల వద్దకు వెళ్లినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఇతర కులాల వాళ్లు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లినపుడు, డోర్‌ లాక్‌ చేసిన సమయంలో ఎలా కులగణన చేస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా రాజకీయ జోక్యం లేకుండా చూడాలన్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోపా జగదీష్‌ మాట్లాడుతూ శెట్టి, గుప్తా, వైశ్య కాకుండా తమవర్గానికి వైశ్యులుగా గుర్తించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సదస్సులో అన్ని కులాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️