ఒంటికాలిపై నిలబడి మున్సిపల్‌ కార్మికుల నిరసన

ఒంటికాలిపై నిలబడి మున్సిపల్‌ కార్మికుల నిరసన

గుంతకల్లులో ఒంటికాలిపై నిరసన తెలుపుతున్న మున్సిపల్‌ కార్మికులు, సిఐటియు, సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-గుత్తి

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా సోమవారం ప్రజాప్రతినిధులు, అధికారులకు పూలు, పండ్లు ఇచ్చి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా మున్సిపల్‌ కార్మికులు నూతన సంవత్సర రోజును పురస్కరించుకుని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ డి.వన్నూరుబీ, వైస్‌ ఛైర్‌పర్సన్లు బి.పద్మలత బి. వరలక్ష్మి నివాసాల వద్దకు వెళ్లి మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు పూలు, పండ్లు ఇచ్చి నిరసన తెలిపారు. కమిషనర్‌ జి.శ్రీనివాసులుకు కార్యాలయంలో పూలు, పండ్లు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ పారిశుద్ధ కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌.రామాంజనేయులు, కె.సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు కె.మహేష్‌, సహాయ కార్యదర్శి సుంకన్న, కోశాధికారి బాల రంగన్న, నాయకులు ఈశ్వరయ్య, బి.నాగేంద్ర, కె.ఆంజనేయులు, ఇంజనీరింగ్‌ సెక్షన్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌.రాజా, కార్యదర్శి రవిశంకర్‌, నాయకులు మురళి, నరసింహా, శేఖర్‌, ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.గుంతకల్లు : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా సోమవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఒంటికాలిపై నిలబడి సూర్య నమస్కారం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు డి.శ్రీనివాసులు, పార్టీ పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, రైతు సంఘం నియోజకవర్గం అధ్యక్షుడు దాసరి శ్రీనివాసులు, సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కసాపురం రమేష్‌, సాకే నాగరాజు, కెవిపిఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి జగ్గలి రమేష్‌, పట్టణ కార్యదర్శి రామునాయక్‌, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు కె.నరసయ్య, పట్టణ అధ్యక్షుడు జగదీష్‌, తదితరుతు మద్దతు తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాకెట్ల, మస్తాన్‌, రంగనాయకులు, మల్లేష్‌, దాసు, హనుమంతు, రమణ, తదితరులు పాల్గొన్నారు.

➡️