కమణీయం..రంగనాథుని కళ్యాణం

కమణీయం..రంగనాథుని కళ్యాణం

రంగనాథస్వామి రథోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు

ప్రజాశక్తి-గుత్తి

మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథస్వామి, మాణిక్య రంగనాథస్వామి రథోత్సవం శనివారం వైభవంగా సాంది. తొమ్మిది రోజులపాటు జరిగే స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామి కళ్యాణం కమణీయంగా నిర్వహించారు. దేవస్థానం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఎమ్మెల్యే వై.వెంకటరామి రెడ్డి పూజలు నిర్వహించారు. ఉత్సవ ప్రధాన అధికారి డి.పాండురంగారెడ్డి, ఇఒ వి.దేవదాసు, మాణిక్య రంగనాథ స్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ ధర్మకర్త మాకం శ్రీకాంత్‌, అధ్యక్షులు జీవీ.రామన్‌, కార్యదర్శి జయవరం అశ్వర్థ రంగయ్య, సీఐలు ఎం.వెంకటరామిరెడ్డి, గణేష్‌, తదితరులు రథాన్ని లాగి లాంఛనంగా రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవాన్ని తిలకించడానికి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లను ప్రత్యేకంగా అలంకరించుకుని తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో ఆలయం వెలుపల వెలసిన దుకాణాలు కిటకిటలాడాయి. దేవస్థాన అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గుంతకల్లు డీఎస్పీ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాణిక్య రంగనాథస్వామి దేవస్థాన అభివృద్ధి కమిటీ కోశాధికారి ముత్యాల వెంకటరంగయ్య, సహాయ కార్యదర్శిలు ముత్యాల నాగరాజయ్య, మంచికంటి రామరంగయ్య, సభ్యులు ముత్యాల రంగస్వామి, కె.కిషోర్‌బాబు, కె.సుదర్శన్‌, ఆర్‌.రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️