చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక

Jan 3,2024 22:32

చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరుతున్న అనంత నాయకులు

     అనంతపురం కలెక్టరేట్‌ : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అనంతపురం నగరానికి చెందిన ముస్లిం మైనార్టీలు టిడిపిలో చేరారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన కదిలిరా టిడిపి పిలుస్తోందిరా కార్యక్రమంలో టిడిపి అనంతపురం నియోజకవర్గం ఇన్‌ఛార్జి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి నేతృత్వంలో నగరానికి చెందిన ముస్లిం, మైనార్టీలు టిడిపిలో చేరారు. అధినేత చంద్రబాబు వారికి టిడిపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చంనాయుడు, మాజీ మంత్రి కాలువశ్రీనివాసులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

➡️