జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి -అనంతపురం క్రైం

త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా డీఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐల ఆధ్వర్యంలో పాత నేరస్తులు, రౌడీషీటర్లుచ కర్నాటక మద్యం, నాటుసారా, గుట్కా నియంత్రణ కోసం అనుమానితులు, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లు, పశువుల పాకలు, గడ్డివాములను పరిశీలించారు. ఆయా గ్రామాలలో ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించారు. గ్రామసభలు నిర్వహించి ప్రశాంతంగా జీవించాలని సూచనలు చేశారు. ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని కోరారు. సాయంత్రం రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనదారులపై చర్యలు తీసుకున్నారు

➡️