జెఎన్‌టియును సందర్శించిన న్యాక్‌ బృందం

జెఎన్‌టియును సందర్శించిన న్యాక్‌ బృందం

జెఎన్‌టియులో సమావేశమైన న్యాక్‌ బృందం

ప్రజాశక్తి-అనంతపురం

స్థానిక జెఎన్‌టియును న్యాక్‌ బృందం బుధవారం సందర్శించింది. ఇందులో భాగంగా చెన్నై అన్నా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ టి.త్యాగరాజన్‌ ఆధ్వర్యంలో వచ్చిన కమిటీ సభ్యులకు ఉపకులపతి జి.రంగజనార్ధన వర్శిటీ వివరాలను ప్రజెంటేషన్‌ చేశారు. ముఖ్యంగా సిలబస్‌ రూపకల్పన, కమ్యునిటీ సర్వీస్‌ ప్రాజెక్టు, ఇంటర్న్‌షిప్‌, ఔట్‌ కమ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌, స్టూడెంట్‌ ప్యాకల్టీ నిష్పత్తి, ఉత్తీర్ణత, రీసెర్చ్‌, జాతీయ ర్యాంకింగ్‌, ఎన్‌బిఎ వంటి వివరాలను వివరించారు. అనంతరం కళాశాలలో లైబ్రరీ, సెంట్రల్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌, ఎలక్ట్రికల్‌ విభాగం, మెకానికల్‌ విభాగం, ఎలక్ట్రానిక్స్‌ విభాగం, కంప్యూటర్‌ సైన్సు విభాగాలను సందర్శించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఎం.విజయకుమార్‌, రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌, ఐ క్యూసి డైరెక్టర్‌ జివి.సుబ్బారెడ్డి, యూనివర్సిటీ డైరెక్టర్లు వి.సుమలత, ఇ.కేశవరెడ్డి, కిరణ్మయి, సి.శోభాబిందు, పద్మ సువర్ణ, ఎ.సురేష్‌బాబు, బి.ఈశ్వర్‌రెడ్డి, ఎన్‌.విశాలి, పి.సుజాత, వి.చిత్ర, అనంతపురం కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌వి.సత్యనారాయణ, పులివెందుల కళాశాల ప్రిన్సిపల్‌ ఆర్‌.రమణారెడ్డి, కలికిరి కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️