జెఎన్‌టియులో అమెరికా పెన్‌స్టేట్‌ యూనివర్సిటీ ప్రతినిధులు

జెఎన్‌టియు విసి శ్రీనివాసరావుతో మాట్లాడుతున్న అమెరికా పెన్‌స్టేట్‌ యూనివర్సిటీ ప్రతినిధులు

        అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు ఉపకులపతి ఆచార్య జివిఆర్‌.శ్రీనివాసరావు వర్శిటీ ఉన్నతాధికారులతో కలిసి అమెరికా పెన్‌స్టేట్‌ యూనివర్సిటీ ప్రతినిధులతో శుక్రవారం నాడు కాన్పరెన్స్‌ హాల్లో భేటి అయ్యారు. అనంతపురం జెఎన్‌టియులో జరిగిన ఈ భేటిలో డిగ్రీ ప్రోగ్రాం, పరిశోధనలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జెఎన్‌టియు విసి మాట్లాడుతూ డిగ్రీ ప్రోగ్రాం, పరిశోధన సహకారం, ప్యాకల్టీ ఎక్సేజ్‌ తదితర అంశాలపై చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రతినిధులు డాక్టర్‌ హమీద్‌ అన్సార్‌, డాక్టర్‌ వెంకటరామన్‌, డాక్టర్‌ సాయి రామ్‌, డాక్టర్‌ టాడ్‌ క్లార్క్‌, టివి.రెడ్డి, యూనివర్సిటీ రెక్టార్‌ ఎం.విజయ కుమార్‌ , రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌, ఫారిన్‌ ఆఫైర్స్‌ డైరెక్టర్‌ పి.సుజాత, వి.సుమలత, ఇ.కేశవరెడ్డి, సి.శోభాబిందు నగరు, ఎన్‌.విశాలి, విబి.చిత్ర, కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌వి.సత్యనారయణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఇ.అరుణ కాంతి, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

➡️