జెఎన్‌టియు బీటెక్‌ ఫలితాలు విడుదల

జెఎన్‌టియు పరీక్షల విభాగం

           అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు పరిధిలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించిన బీటెక్‌ మూడవ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయి. ఒకటవ సెమిస్టర్‌ (ఆర్‌20) రెగ్యులర్‌, సప్లిమెంటరీ, బీటెక్‌ మూడవ సంవత్సరం ఒకటవ సెమిస్టర్‌ (ఆర్‌15), (ఆర్‌19) సప్లిమెంటరీ, బీటెక్‌ మూడవ సంవత్సరం రెండవ సెమిస్టర్‌ (ఆర్‌20), (ఆర్‌19), (ఆర్‌15) సప్లిమెంటరీ, బీటెక్‌ మూడవ సంవత్సరం ఒకటవ సెమిస్టర్‌ (ఆర్‌15) సప్లిమెంటరీ (చివరి అవకాశం), బీటెక్‌ మూడవ సంవత్సరం రెండవ సెమిస్టర్‌ (ఆర్‌15) సప్లిమెంటరీ (చివరి అవకాశం) ఇచ్చిన పరీక్షా ఫలితాలు, ఎం.ఫార్మసీ మూడవ సెమిస్టర్‌ (ఆర్‌21) రెగ్యులర్‌, సప్లిమెంటరీ, ఎం.ఫార్మసీ మూడవ సెమిస్టర్‌ (ఆర్‌17) సప్లిమెంటరీ ఫలితాలు, ఫార్మాడీ ఒకటవ సంవత్సరం (ఆర్‌17), ఫార్మాడీ రెండవ సంవత్సరం (ఆర్‌17), ఫార్మా.డీ మూడవ సంవత్సరం (ఆర్‌17) అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ఫలితాలు, ఫార్మాడీ (పిబి) ఒకటవ సంవత్సరం (ఆర్‌17), ఫార్మా.డీ (పిబి) రెండవ సంవత్సరం (ఆర్‌17) అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. పరీక్ష ఫలితాల కోసం జెఎన్‌టియ వెబ్‌సైట్‌ షషష.jఅ్‌బa.aష.ఱఅను సంప్రదించాలని డైరెక్టర్‌ అఫ్‌ ఎవాల్యుయేషన్‌ ఆచార్య ఇ.కేశవరెడ్డి, కంట్రోలర్‌ అఫ్‌ ఎగ్జామినేషన్‌ బి.చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు.

➡️