పోరు ఆగదు..!

Dec 28,2023 09:04

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె దీక్షల్లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ డా||గేయానంద్‌

          అనంతపురం కలెక్టరేట్‌ : ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెపోరాటం ఆగదని ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు స్పష్టం చేశారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన సమ్మె బుధవారం 8వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. జేఏసీ ఛైర్మన్‌ కె.విజరు అధ్యక్షతన కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన సమ్మెకు మాజీ ఎమ్మెల్సీ, ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు జేఏసి గౌరవాధ్యక్షులు డాక్టర్‌ గేయానంద్‌ ముఖ్య అతిథిగా హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. జేఏసీ ఛైర్మన్‌ విజరు మాట్లాడుతూ న్యాయమైన హక్కుల కోసం ఉద్యోగులు సమ్మె చేపడుతుంటే ఎస్‌ఎస్‌ఏ పీవో బెదిరింపు ధోరణితో ఉద్యోగుల పట్ల వ్యవహరించడం అన్యాయంగా ఉందన్నారు. ప్రభుత్వం స్పందించేంత వరకు పోరాటం ఆగదన్నారు.

➡️