పోలీస్‌ డైరీ-2024 ఆవిష్కరణ

పోలీసు డైరీ-2024ను ఆవిష్కరిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌

         అనంతపురం క్రైం : జిల్లా ఎస్పీ కెకెఎన్‌.అన్బురాజన్‌ పోలీస్‌ డైరీ-2024ను బుధవారం నాడు జిల్లా పోలీస్‌ కాన్ఫిరెన్స్‌ హాల్లో ఆవిష్కరించారు. పోలీసులకు సంబంధించి సమగ్ర సమాచారం కలిగి ఉన్న డైరీ పోలీస్‌ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ తెలియజేశారు. పోలీస్‌ డైరీ – 2024 తయారీకి కషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆర్‌.విజయ భాస్కర్‌రెడ్డి, జిల్లా పోలీస్‌ అధికారుల సంఘం అడహక్‌ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌ నాథ్‌, సుధాకర్‌ రెడ్డి, గాండ్ల హరినాథ్‌, తేజ్‌ పాల్‌, శివ ప్రసాద్‌, వెంకట రమణ, సరోజ పాల్గొన్నారు. పలు అంశాలపై విద్యార్థులకు అవగాహనఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు పలు అంశౄలపై అవగాహన కల్పిస్తున్నారు. ర్యాగింగ్‌ నిరోధం, మాదక ద్రవ్యాల పర్యవసనాలు, బాల్య వివాహాల చట్టం, దిశ యాప్‌, సైబర్‌ నేరాలు, డయల్‌ – 100, రోడ్డు ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలు తదితర అంశాలపై విద్యార్థులకు వివరిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే విద్యార్థులు వీటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

➡️