ప్రశాంతంగా గ్రూప్‌-2 పరీక్ష

కళ్యాణదుర్గంలో పరీక్షలు రాస్తున్న గ్రూప్‌-2 అభ్యర్థులు

         అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి 01:00 గంటల వరకు 111 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. పరీక్షలకు 32,391 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 27,328 మంది హాజరయ్యారన్నారు. 5,063 మంది అభ్యర్థులు గైర్హాజరు అయ్యారు. 84.37 హాజరు శాతం నమోదు అయ్యింది. జిల్లా వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ ఎం.గౌతమి, ఎస్పీ అన్బురాజన్‌తో పాటు ఆయా ప్రాంతాల్లో అధికారులు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్ష కేంద్రాల పరిశీలనఅనంతపురం, పరిసర ప్రాంతాల్లోని వివిధ కళాశాలల్లో ఆదివారం జరిగిన గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ పరీక్షల నిర్వహణను ఎస్పీ కెకెఎన్‌.అన్బురాజన్‌ పరిశీలించారు. ఎస్‌ఎస్‌బిఎన్‌, ఆర్ట్స్‌, సెయింట్‌ ఆన్స్‌ కళాశాలలో జరుగుతున్న పరీక్షల తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిర్వహిస్తున్న పోలీసు బందోబస్తును సమీక్షించారు.

➡️