బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

కార్మికులతో మాట్లాడుతున్న కమిషనర్‌ మేఘ స్వరూప్‌

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌

సురక్షిత ప్రమాణాలు పాటించడంతోపాటు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని కమిషనర్‌ మేఘ స్వరూప్‌ కార్మికులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థలో ఉన్న మూడవ సర్కిల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేఘస్వరూప్‌ మాట్లాడుతూ విధుల్లో పాల్గొనేటప్పుడు ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకూడదన్నారు. బూట్లు, గ్లౌజ్‌లు తదితర రక్షణ వస్తువులను వాడాలన్నారు. వేకువ జామునే విధులకు హాజరై నగర పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నగర సుందరీకరణ, పారిశుధ్యం మెరుగులో కార్మికులది కీలక పాత్ర అన్నారు. ఇందులో భాగంగా విధులకు ఆలస్యంగా వచ్చిన వారిని హెచ్చరించారు. అనంతరం పారిశుధ్య పర్యవేక్షణ విధులకు గైర్హాజరైన 45, 46, 48వ వార్డుల శానిటేషన్‌ కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం నగరంలోని అరవింద్‌నగర్‌, ఆదర్శకాలనీ, హమాలీకాలనీ, నవోదయ కాలనీ, కలెక్టరేట్‌, తదితర ప్రదేశాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమాల్లో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ ఆంజనేయులు, సచివాలయ, పారిశుధ్య కార్యదర్శులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

➡️