బాలోత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న డిఇఒ నాగరాజు తదితరులు

Dec 28,2023 09:03

 

అనంత బాలోత్సవాలను జయప్రదం చేద్దాం

అనంతపురం కలెక్టరేట్‌ : ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో నిర్వహిస్తున్న పిల్లల పండుగ ‘అనంత బాలోత్సవం-4’ను జయప్రదం చేద్దామని జిల్లా విద్యాశాఖాధికారి వి.నాగరాజు పిలుపునిచ్చారు. అనంత బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన అనంత బాలోత్సవం బ్రోచర్‌లను డిఇఒ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆటలు, పాటలు, సైన్స్‌ ఆవిష్కరణలు, కళానైపుణ్యాభివృద్ధికి దోహదపడేలా అనంత బాలోత్సవం నిర్వహిస్తున్నారని తెలిపారు. సృజనాత్మకత, సాంస్కృతిక కళ, దేశభక్తి గేయాలు, నాటికలు తదితర ఈవెంట్‌లతో మూడు రోజుల పాటు అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల ఎగ్జిబిషన్‌ మైదానంలో బాలోత్సవం జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొని బాలోత్సవం-4ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఇఒ కార్యాలయం సూపరింటెండెంట్‌ శ్రీనాథ్‌, ఆదినారాయణ, యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు, అనంత బాలోత్సవ కమిటీ కోశాధికారి మహమ్మద్‌ జిలాన్‌, కమిటీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వి.సావిత్రి, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమయ్య, జిల్లా గౌరవాధ్యక్షులు రమణయ్య, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి, ఉపాధ్యక్షురాలు రామాంజినమ్మ, కమిటి సభ్యులు సురేష్‌, ఎస్‌టియు జిల్లా అధ్యక్షులు సూర్యుడు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️