మున్సిపల్‌ కార్మికులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి

స్పందనలో సమస్యలను వివరిస్తున్న కార్మికుల యూనియన్‌ నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

మున్సిపల్‌ పారిశుధ్యం, ఇంజనీరింగ్‌ కార్మికులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని మున్సిపల్‌ ఉద్యోగులు కార్మికుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.నాగభూషణ, జిల్లా అధ్యక్షులు ఎటిఎం.నాగరాజు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో స్పందన గ్రీవెన్స్‌సెల్‌లో డిఆర్‌ఓ గాయత్రీదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం నగరపాలక సంస్థలో పారిశుధ్యం, ఇంజనీరింగ్‌ కార్మికులు 800 మందికి పైబడి పని చేస్తున్నారని తెలిపారు. కార్మికులందరూ అనంతపురం రూరల్‌ ఉప్పరపల్లి పంచాయతీలో గుట్టను సదును చేస్తూ ముళ్లపొదలను కంపచెట్లను శుభ్రం చేశారని తెలిపారు. కావున ఆ భూమిని మున్సిపల్‌ కార్మికులందరికీ ఇళ్ల సలాలు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు గురురాజా, ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, మున్సిపల్‌ కార్మికుల యూనియన్‌ కోశాధికారి భర్తల ఆదినారాయణ, ఇంజనీరింగ్‌ విభాగం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంజీవ రాయుడు, మల్లికార్జున, నగర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి, పోతులయ్య, పారిశుధ్య విభాగం నగర అధ్యక్ష, కార్యదర్శులు బండారు స్వామి, సాకే తిరుమలేష్‌, మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా నాయకులు వరలక్ష్మి, ఆదినారాయణ, సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️