మున్సిపల్‌ కార్మికులు,మున్సిపల్‌ కార్మికులంటే అంత నిర్లక్ష్యమా..

మున్సిపల్‌ కార్మికులు,మున్సిపల్‌ కార్మికులంటే అంత నిర్లక్ష్యమా..

రాయదుర్గంలో నడుముకు ఆకులు కట్టుకుని నిరసన తెలుపుతున్న

ప్రజాశక్తి-గుత్తి

మున్సిపల్‌ కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె మంగళవారం గుత్తిలో 15వ రోజుకు చేరుకుంది. వీరికి సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరునెలల్లోపు మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని జగన్‌ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కరోనా సమయంలో మున్సిపల్‌ కార్మికుల కాళ్లు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకుని కార్మికులకు ఒక్కొక్కరికి లక్ష ఇచ్చినా తక్కువే అన్న ప్రధాని మోడీ మాట ఏమైందని నిలదీశారు. కార్మికుల సమ్మెతో పట్టణాలు చెత్తాచెదారంతో దుర్గంధం వస్తుంటే ప్రభుత్వానికి కనపడలేదా.. అన్నారు. వెంటనే సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం శిబిరం వద్ద వంటావార్పు చేసి సహాఫంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వి.నిర్మల, అధ్యక్షుడు ఎం.మల్లేష్‌, రైతుసంఘం నాయకుడు బి.రామకృష్ణ, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి యు.మల్లికార్జున, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి.రమేష్‌, ఐద్వా నాయకురాలు కవిత, మున్సిపల్‌ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.రామాంజనేయులు, కె.సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు కె.మహేష్‌, సహాయ కార్యదర్శి టి.సుంకన్న, కోశాధికారి బాలరంగన్న, నాయకులు బేడల నాగేంద్ర, ఈశ్వరయ్య, కె.అంజనేయులు, ఇంజనీరింగ్‌ కాంట్రాక్టు కార్మికుల యూనియన్‌ అధ్యక్షుడు ఎస్‌.రాజా, ఉపాధ్యక్షుడు ఎస్‌ఎ. మురళి, కార్యదర్శి రవిశంకర్‌, సహాయ కార్యదర్శి నరసింహా, కోశాధికారి నక్క శేఖర్‌, నాయకులు శేఖర్‌, ఓబులేసు, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.రాయదుర్గం : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కార్మికులు చేపట్టిన ఆందోళనలో భాగంగా మంగళవారం రాయదుర్గంలో పంగనామాలు పెట్టుకుని, నడుముకు వేపాకు చుట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ నిన్న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కలెక్టరేట్ల ముందు ధర్నాల్లో కార్మికులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. మహిళా కార్మికులు అని కూడా చూడకుండా పురుష పోలీసులు రోడ్లపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్‌ కార్మికులు మనుషుల్లాగా కనబడడం లేదా.. అని ప్రశ్నించారు. అదేవిధంగా సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులను రాడికల్స్‌తో పోల్చిన పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వెంటనే ఆయన తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు రాము, తిప్పేస్వామి, మల్లేష్‌, వెంకటేశులు, నాయకులు తిప్పేరుద్ర, మైలారప్ప, ఓబన్న, నరసింహులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.కార్మికులతో ప్రజాప్రతినిధుల చర్చలుస్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని ఛైర్‌పర్సన్‌ ఛాంబర్‌లో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పొరాళుశిల్ప, కమిషనర్‌ దివాకర్‌రెడ్డి మున్సిపల్‌ కార్మికులతో చర్చించారు. పట్టణంలో 15రోజుల నుంచి కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టడం వల్ల తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడిందన్నారు. ప్రత్యామ్నాయంగా కొంతమంది ఇంజనీరింగ్‌ కార్మికులు విధులకు హాజరుకావాలని, రెగ్యులర్‌ కార్మికులను, చెత్త ట్రాక్టర్లను అడ్డుకోకూడదని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కార్మికులు స్పందిస్తూ యూనియన్‌ నాయకులతో చర్చించి తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో వైస్‌ఛైర్మన్‌ వలిబాషా, వైసిపి నాయకులు పోరాళు శివ, వార్డు సభ్యులు శివకుమార్‌, శివప్ప, దివాకర్‌, రామాంజనేయులు, నిజాముద్దీన్‌, కృష్ణమూర్తి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, సిపిఎం నాయకులు నాగరాజు , మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️