మున్సిపల్‌ కార్మికుల భిక్షాటన

మున్సిపల్‌ కార్మికుల భిక్షాటన

గుత్తిలో భిక్షాటన చేస్తున్నమున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి-గుత్తి

పట్టణంలో భిక్షాటన చేస్తూ మున్సిపల్‌ కార్మికులు గుత్తిలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా కార్మికులు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం నుంచి గాంధీ కూడలి మీదుగా రాజీవ్‌గాంధీ సర్కిల్‌ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.రామాంజినేయులు, కె.సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు కె.మహేష్‌, సహాయ కార్యదర్శి సుంకన్న, కోశాధికారి బాలరంగన్న, నాయకులు బేడల నాగేంద్ర, ఈశ్వరయ్య, కె.ఆంజనేయులు, ఇంజనీరింగ్‌ కార్మికుల యూనియన్‌ అధ్యక్షుడు ఎస్‌. రాజా,ఉపాధ్యక్షుడు ఎస్‌ఎ.మురళి, కార్యదర్శి రవిశంకర్‌, కోశాధికారి నక్కా శేఖర్‌, నాయకులు నరసింహ, రాజ్‌కుమార్‌, ఓబులేష్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.గుంతకల్లు : ప్రభుత్వ అలసత్వాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరం నుంచి కార్మికులు సిఎం జగన్‌ చిత్రపటాన్ని మెడలో వేసుకుని ఊరేగింపుగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా నాయకులు కె.నరసయ్య, పట్టణ కార్యదర్శి జగదీష్‌, నాయకులు సూరి, మల్లేష్‌, రాకెట్ల మస్తాన్‌, రంగనాయకులు, ప్రేమ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.రాయదుర్గం : సమ్మెలో భాగంగా ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు పట్టణంలో భిక్షాటన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. భిక్షాటన ద్వారా మున్సిపల్‌ కార్మికులు పట్టణ ప్రజల నుంచి రూ. 13,125 సేకరించారు. ఈ ఆర్థిక సాయాన్ని సమ్మె ఖర్చులకు ఉపయోగిస్తామని తెలిపారు. సమస్యలను పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున, ఫెడరేషన్‌ నాయకులు రాము, తిప్పేస్వామి, మల్లేష్‌, కుమార్‌, బసవరాజు, ఇంజినీరింగ్‌ కార్మిక సంఘం నాయకులు తిప్పే రుద్ర, నరసింహులు, మైలారప్ప, ఓబన్న, గోపాల్‌, కార్మికులు పాల్గొన్నారు.

➡️