మోడీ చేతుల్లో దేశం నాశనం

అనంతపురం టవర్‌ క్లాక్‌ వద్ద నిరసన తెలుపుతున్న వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు

           అనంతపురం కలెక్టరేట్‌ : కార్మికుల, కర్షకలు, ప్రజా వ్యతిరేక విధనాలను అవలంభిస్తున్న మోడీ దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌ జిల్లాలో విజయవంతం అయ్యింది. ఇందులో భాగంగా అనంతపురం ఆర్ట్స్‌ కాలేజ్‌ మైదానం నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌, శ్రీకంఠం, రాజు, సప్తగిరి సర్కిళ్ల మీదుగా టవర్‌ క్లాక్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ 30 నిమిషాలపాటు రోడ్డుమీద బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఎఐటియుసితో పాటు వివిధ కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్ర కుమార్‌, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి రాజారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ రెడ్డి, కౌలు రైతు సంఘం కార్యదర్శి బాల రంగయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌, సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌ రెడ్డి, రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఐఎఫ్‌టియు యేసురత్నం తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా పాలనసాగిస్తూ కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తోందని విమర్శించారు. రైతులకు నష్టదాయకంగా ఉన్న నల్ల చట్టాలు రద్దు చేయాలని అన్నదాతలు ఆందోళన చేస్తున్నా బిజెపి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. రైతుల ఆందోళనలను పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. ప్రశ్నించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షాలు బిజెపికి భయపడి మౌనంగా ఉన్నాయన్నారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు మోడికి మోకరిళ్లి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కార్మికులు, కర్షకులు, ప్రజలు ఐక్యమత్యంగా పోరాడి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. ఇదే నినాదంతో ఐక్యపోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మల్లికార్జున, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, గ్రానైట్స్‌ అండ్‌ టైల్స్‌ యూనియన్‌ నాయకులు ఎర్రి స్వామిరెడ్డి, వీరయ్య, అంబులెన్స్‌ డ్రైవర్‌ యూనియన్‌ నాయకులు జిలాన్‌, రమేష్‌, సిపిఎం నగర కార్యదర్శులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు రాజేష్‌ గౌడ్‌, భగత్‌ సింగ్‌ ఆటో కార్మికుల యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్టీఆర్‌ శ్రీనివాసులు, సిఐటియు నాయకులు రామాంజనేయులు, చీమల ప్రకాష్‌ రెడ్డి, లతీఫ్‌, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనమ్మ, మున్సిపల్‌ కార్మికులు యూనియన్‌ నాయకులు లక్ష్మీనారాయణ, బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు జగదీష్‌ నాయుడు, మహేష్‌, భగత్‌ సింగ్‌ ఆటో యూనియన్‌ నాయకులు ఆదినారాయణ, ఇర్ఫాన్‌, నాగరాజు, శివప్రసాద్‌, మురళి, రామలింగారెడ్డి, ఉమాగౌడ్‌, హమాలీ యూనియన్‌ నాయకులు రామదాసు, మధు పాల్గొన్నారు.

➡️