యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి

వాలీబాల్‌ ఆడుతున్న అతిథులు

ప్రజాశక్తి-అనంతపురం

యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జాతీయ యువ అవార్డు గ్రహీత బిసాటి భరత్‌ పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం, ప్రగతి పథం యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో యువతకు శుక్రవారం బ్లాక్‌ లెవెల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆడటం వల్ల మానసిక ఒత్తిడిని జయించి ఆరోగ్యంగా ఉంటారన్నారు. అంతేగాకుండా క్రీడాకారులకు భవిష్యత్తులో ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత జీవన్‌కుమార్‌ మాట్లాడుతూ యువత సామాజిక మాధ్యమాల్లో ఉన్నంత చురుగ్గా క్రీడల్గో పాల్గొనలేకపోతున్నారు. కావున సామాజిక మాధ్యమాల వినియోగం తగ్గించి క్రీడల్లో పాల్గొని ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన యువతకు ట్రోఫీతోపాటు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ గరుగు బాలాజీ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత జయమారుతి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ సత్యసౌమ్య, రూడ్‌సెట్‌ ట్రైనర్‌ ఉషారాణి, ప్రగతి పథం యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు ప్రదీప్‌, పవన్‌, యువతీ, యువకులు పాల్గొన్నారు.

➡️