రోడ్డు మరమ్మతులో పోలీసులు

జెసిబితో రోడ్డు పనులను చేయిస్తున్న అధికారులు

         అనంతపురం క్రైం : తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న రహదారి మరమ్మతుపై పోలీసులు దృష్టి సారించారు. పైపు లీకేజీతో రహదారిపై నీరు నిల్వడం వల్ల తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతంలో జేసిబి ద్వారా ఆ నీటిని మళ్లించి రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టారు. పైప్‌లైన్‌ లీకేజీ అయ్యి నీరు రోడ్డుపై పారుతుండడంతో కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలోని అనంతపురం- ఉరవకొండ రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండేవి. ఈ సమస్యపై దృష్టి సారించిన కూడేరు ఎస్‌ఐ సత్యనారాయణ బుధవారం ఉదయం జెసిబి ద్వారా ఆ నీటిని రహదారిపైకి రాకుండా పక్కకు మళ్లించారు. సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకున్న కూడేరు ఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బందిని ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ అభినందించారు.

➡️