వాల్మీకులు అన్ని రంగాల్లో రాణించాలి

ర్యాలీలో పాల్గొన్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ ఎంపీ రంగయ్య

         కళ్యాణదుర్గం : వాల్మీకులు అన్ని రంగాల్లో అభివద్ధి చెందాలని జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయగిరిజమ్మ పిలుపునిచ్చారు. బుధవారం నాడు కళ్యాణదుర్గం మండల పరిధిలోని పింజరి కొట్టాల గ్రామంలో వాల్మీకి విగ్రహాన్ని ఎంపీ తలారి రంగయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకులు విద్యపై శ్రద్ధ పెట్టి పిల్లల్ని బాగా చదివించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిప్పేస్వామి, రామ్మోహన్‌, సూరి పాల్గొన్నారు.

➡️