విద్యార్థులకు విద్యాదీవెన సాయం

విద్యార్థులకు మెగా చెక్కును అందిస్తున్న కలెక్టర్‌ గౌతమి, తదితరులు

           అనంతపురం : జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్‌, డిసెంబర్‌ – 2023 త్రైమాసికానికి సంబంధించి 40,006 మంది విద్యార్థులకు రూ.29.08 కోట్ల సాయాన్ని అందించారు. శుక్రవారం నాడు కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యాదీవన పంపిణీ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్‌ బోయ గిరిజమ్మ, కలెక్టర్‌ ఎం.గౌతమి పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యా దీవెన మెగా చెక్కును విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, వాసంతి సాహిత్య, జిల్లా వక్ఫ్‌ బోర్డు ఛైర్‌పర్సన్‌ రిజ్వాన్‌, సిడబ్ల్యూసి ఛైర్‌పర్సన్‌ మేడా రామలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ ఉమాదేవి, సోషల్‌ వెల్ఫేర్‌ జెడి మధుసూదన్‌ రావు, డిటిడబ్ల్యూఒ రామాంజనేయులు, బిసి వెల్ఫేర్‌ డిడి ఖుష్బు కొఠారి, వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి రసూల్‌, మైనార్టీ సంక్షేమ శాఖ ఎడి రామసుబ్బారెడ్డి, ఆయా శాఖల అధికారులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

➡️