విద్యార్థులను హాస్టల్‌ ఖాళీ చేయించొద్దు

విద్యార్థులను హాస్టల్‌ ఖాళీ చేయించొద్దు

ఆందోళన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

కేంద్ర ఎన్నికల బలగాల కోసం విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లను ఖాళీ చేయించడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎస్‌కెయు ఇంజనీరింగ్‌ విద్యార్థులను హాస్టల్‌ను ఖాళీ చేయించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వైస్‌ఛాన్స్‌లర్‌ హుస్సేన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అంతకు మునుపు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు గిరి, సిద్ధు, ఎస్కెయు ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు శివారెడ్డి, వంశీ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు రానున్న కేంద్ర బలగాల కోసం ఎస్‌కెయులో ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఉన్న తుంగభద్ర బ్లాక్‌-2 హాస్టల్లో విద్యార్థులను ఖాళీ చేయించారని తెలిపారు. ఖాళీ చేయించిన విద్యార్థులను పాడుబడిన గంగ హాస్టల్లోకి పంపించాలని యాజమాన్యం చూస్తోందన్నారు. యూనివర్సిటీ యాజమాన్యం అలాగే ప్రవర్తించి హాస్టల్స్‌ ఖాళీ చేయిస్తే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను కలుపుకుని పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కెయు ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ నాయకులు చంద్ర నాయక్‌, మోహన్‌, బండేష్‌, సండే, గణేష్‌, రవి ప్రకాష్‌, ఇంజనీరింగ్‌ విద్యార్థులు సూర్య, గణేష్‌ నాయక్‌, హరీష్‌ నాయక్‌, నందు తదితరులు పాల్గొన్నారు.

➡️