విమర్శలు మానుకో..: విప్‌ కాపు

విమర్శలు మానుకో..: విప్‌ కాపు

మాట్లాడుతున్న విప్‌ కాపు’కాలవ’..

అనంతపురం : మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఇప్పటికైనా తనపై విమర్శలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని విప్‌ కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలవ శ్రీనివాసులు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏమీ చేయకపోగా ఇసుకలో మూడు వందల కోట్లు కొట్టేశారని ఆరోపించారు. ఇప్పుడు వచ్చి తనపై విమర్శలు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. తాను గెలిచాక రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు వేయించానన్నారు. నలభై గ్రామాలకు తాగునీరు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. రేపటి నుంచి తాను చేసి అభివృద్ధిపై సెల్ఫీ ఛాలెంజ్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా 52 చెరువులకు నీరిచ్చేలా డీపీఆర్‌ రిపోర్ట్‌ సిద్ధం చేయించామన్నారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు కాపు మాధవరెడ్డి పాల్గొన్నారు.

➡️