‘విశ్వ’ గెలుపే లక్ష్యంగా పని చేద్దాం

'విశ్వ' గెలుపే లక్ష్యంగా పని చేద్దాం

మాట్లాడుతున్న వైసిపి యువజన విభాగం జోనల్‌ ఇన్‌ఛార్జి ప్రణరురెడ్డి

ప్రజాశక్తి-ఉరవకొండ

వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి విజయమే లక్ష్యంగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తనయుడు, వైసిపి యువజన విభాగం జోనల్‌ ఇన్‌ఛార్జి వై.ప్రణరురెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం విడపనకల్‌ మండల పరిధిలోని హావలిగి గ్రామంలో సర్పంచి గీతమ్మ ఆధ్వర్యంలో విజయసంకల్ప యాత్ర జైత్రయాత్ర చేపట్టారు. ముందుగా పాల్తూరు నుంచి హావళిగి వరకూ భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హావలిగి నేతలు గజమాలతో యువనేతను సత్కరించారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రణరురెడ్డి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేయడానికి పయ్యావుల కేశవ్‌ వస్తున్నారన్నారు. ఏం చేయాలో దిక్కుతోచక ఓటమి భయంతో పయ్యావుల కేశవ్‌ నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారన్నారు. కేశవ్‌ ఎన్ని జిమ్మిక్కులు కుయుక్తులు పడినా మోసపోవద్దన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం హవలిగి గ్రామంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించినట్లు వివరించారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని మరొకసారి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కరణం పుష్పావతి భీమిరెడ్డి, జడ్పిటిసి హనుమంతు, మండల కన్వీనర్‌ బసన్న, జెసిఎస్‌ కన్వీనర్‌ భరత్‌రెడ్డి, ఎంపిటిసిలు కళావతి, రాజశేఖర్‌, మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ డోనేకల్‌ రమేష్‌, పిఎసిఎస్‌ ఛైర్మన్‌ శ్రీరాములు, నాయకులు కరణం భీమిరెడ్డి, దేశారు సిద్ధార్థ, ఉమాశంకర్‌, ప్రసాద్‌, సురేష్‌యాదవ్‌, మడకశిర తిప్పయ్య, రామాంజనేయులు, వెంకటస్వామి, సుంకన్న, ఉలిగప్ప, యువరాజు, గిరిబాబు, ప్యాపిలి భీమా, కిష్టా, ధనుంజయ, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️