వేగంగా అర్జీలకు పరిష్కారం

అర్జీదారులతో కిటకిటలాడుతున్న అనంతపురం కలెక్టరేట్‌

            అనంతపురం : వివిధ సమస్యలపై ప్రజలు అందించే అర్జీలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని ఆయా శాఖల అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 327 అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన గ్రీవెన్స్‌ అర్జీలను వేగంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి అర్జీదారునికి మేలు జరిగేలా పరిష్కారం చూపించాలన్నారు. గడువులోపు ఎలాంటి పెండింగ్‌ ఉంచకుండా పరిష్కరించాలన్నారు. ప్రతినిత్యం మానిటర్‌ చేస్తూ అర్జీలకు పరిష్కారం చూపించడంపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘస్వరూప్‌, జిల్లా పరిషత్‌ సీఈవో వైఖోమ్‌ నిదియా దేవి, డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ ఆనంద్‌, ఆర్డీవో జి.వెంకటేష్‌, సిపిఒ అశోక్‌కుమార్‌రెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️