షికారీలకు ఇళ్ల పట్టాలు అందజేత

షికారీలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్న ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌

          అనంతపురం : అనంతపురంలోని షికారీలకు అధికారులు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఎస్పీ కెకెఎన్‌.అన్బురాజన్‌, జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నగరంలోని ఎన్టీఆర్‌ కాలనీలో పరివర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 65 మంది షికారీలకు ఇళ్ల పట్టాలను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఇంటి పట్టాలు అందించామని, దానిని అమ్ముకోకూడదన్నారు. అందరూ ఇంటి నిర్మాణం చేపట్టి అక్కడ నివాసం ఉండాలన్నారు. షికారీలు ఆరు మందితో కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా సమస్య వస్తే ఆ కమిటీ వారు అధికారుల దష్టికి తెస్తే సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. షికారీల పిల్లల కోసం ఉదయం, సాయంత్రం ట్యూషన్లను కొంతమంది దాతల సాయంతో ఏర్పాటు చేశామన్నారు. షికార్లీ ఇళ్ల నిర్మాణాలకు ఆర్డీటీ సహకారం అందిస్తామని తెలియజేసిందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని షికారీలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జి.వెంకటేష్‌, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, డీఎస్పీ వీర రాఘవరెడ్డి, సిఐ విశ్వనాథ్‌ చౌదరి పాల్గొన్నారు.

➡️