సమన్వయంతో పని చేయాలి : ఎస్పీ

సమన్వయంతో పని చేయాలి : ఎస్పీ

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌

ప్రజాశక్తి-అనంతపురం క్రైం

త్వరలో జరగనున్న ఎన్నికల్లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని ఎలెక్షన్‌ వింగ్స్‌ సమన్వయంతో సమర్థవంతంగా పని చేయాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ సూచించారు. ఎన్నికల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ఎలెక్షన్‌ వింగ్స్‌తో మంగళవారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్పెషల్‌ బ్రాంచి, లా అండ్‌ ఆర్డర్‌, సెబ్‌, ఏ.ఆర్‌, సైబర్‌, ఐ.టి.కోర్‌, తదితర విభాగాల అధికారులు వారికి కేటాయించిన విధులను పక్కాగా నిర్వర్తించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ఏం చేయాలో దిశానిర్ధేశం చేశారు. ఈసమావేశంలో అదనపు ఎస్పీలు ఆర్‌.విజయభాస్కర్‌రెడ్డి, జి.రామకృష్ణ, ఎస్‌.లక్ష్మీనారాయణరెడ్డి, డీఎస్పీ ఎం.ఆంథోనప్ప, సిఐలు జాకీర్‌ హుస్సేన్‌, ఇందిర, షేక్‌ జాకీర్‌, విశ్వనాథచౌదరి, సంజీవకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️