హామీలు అమలు చేయాలి

Feb 4,2024 22:11

అంగన్వాడీల అభినందన సభలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు

                      ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : సమ్మె కాలంలో అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్‌ చేశారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు జిల్లాలో 42 రోజులుగా చేపట్టిన నిరవదిక సమ్మె విజయంవంతం కావడానికి సహకరించిన ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అధికారులు, న్యాయం చేయడానికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ అంగన్‌వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో అభినందన సభ నిర్వహించారు. ఆర్ట్స్‌ కళాశాల ఎగ్జిబిషన్‌ మైదానంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శకుంతల, రమాదేవి అధ్యక్షతన నిర్వహించిన అభినందన సభకు ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు హాజరయ్యారు. ఈ సభలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నాగమణి, ఎస్‌.నాగేంద్రకుమార్‌, జిల్లా కోశాధికారి టి.గోపాల్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర మాజీ నాయకురాలు లలితమ్మ, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, సిఐటియు ఆఫీస్‌ బేరర్స్‌ మన్నీల రామాంజినేయులు, కే.నాగభూషణం, సిఐటియు నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముత్తుజా, జిల్లా నాయకులు ఆర్‌వి.నాయుడు, వి.రామిరెడ్డి, అచ్యుత్‌, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.బాల రంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సూరి, ఎం.క్రిష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జి.ఓబులు మాట్లాడుతూ అంగన్‌వాడీల నిరవదిక సమ్మె చరిత్ర సృష్టించిందన్నారు. 42 రోజుల పాటు వినూత్న రీతిలో ఐక్యమత్యంగా అంగన్‌వాడీలు చూపిన పోరాట పటిమ ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం చివరకు దిగిరాక తప్పలేదన్నారు. చర్చల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. తక్షణమే జీవో జారీ చేసి త్వరితగతిన ఆ ఫలాలు అంగన్‌వాడీలకు అందేలా చూడాలన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శకుంతల, రమాదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కష్టమొచ్చినా నష్టమొచ్చిన మేమున్నామంటూ సిఐటియు నాయకత్వం అండగా నిలిచిందన్నారు. జిల్లా నుంచి రాష్ట్ర, కేంద్ర నాయకత్వం వరకు అంగన్‌వాడీల పక్షాన పోరాడారని, ఆ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల సిఐటియు నాయకులు శివశంకర్‌, పోతులయ్య, నాగేంద్ర, రమేష్‌, లోకేష్‌, మల్లికార్జున, ఆటో యూనియన్‌ నాయక్‌ నాయకులు ఆజాంబాషా, ఆది, సురేష్‌, చంద్రశేఖర్‌ అంగన్‌ వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి జమున, నాయకులు పాతక్క, మేరి, ధనలక్ష్మి, రేష్మా, కాత్యాయని, అరుణ, శ్రీదేవి పాల్గొన్నారు.

➡️