11 నుంచి ‘అనంత సంకల్పం’ అమలు

11 నుంచి 'అనంత సంకల్పం' అమలు

సమావేశంలో మాట్లాడుతున్న డిఇఒ నాగరాజు

 

ప్రజాశక్తి-అనంతపురం సిటీ

ఈనెల 11వ తేదీన ఉంచి వంద రోజుల ‘అనంత సంకల్పం’ అనే కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలని డిఇఒ నాగరాజు సూచించారు. ఈమేరకు శుక్రవారం నగరంలోని ఉపాధ్యాయ భవనంలో అనంత సంకల్పం మెటీరియల్‌ తయారీపై ఒక్కరోజు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరిగే పదవ తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధిచేందుకే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. చదువులో వెనుకబడిన పదో తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని వారికిఉపయోగపడేలా మెటీరియల్స్‌ తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎడి కృష్ణయ్య, పరీక్షల విభాగం ఎసి గోవిందనాయక్‌, డిసిఇబి సెక్రరీ పురుషోత్తంబాబు, హెచ్‌ఎంలు, టీచర్లు పాల్గొన్నారు.పాఠశాల యాజమాన్య కమిటీలు కొనసాగిస్తూ ఉత్తర్వులు..జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని తల్లిదండ్రుల కమిటీలను (పాఠశాల యాజమాన్య కమిటీలను) కొనసాగిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీనివాసరావు ఉత్తర్వులను విడుదల చేసినటుల సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త వరప్రసాద రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 1779 పాఠశాలలు ఉండగా, 1773 పాఠశాల యాజమాన్య కమిటీలు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ కొనసాగుతాయన్నారు.

➡️