అనంత కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న డా||వి.వినోద్‌కుమార్‌

           అనంతపురం కలెక్టరేట్‌ : అనంతపురం జిల్లా నూతన కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారిగా డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌, ఇన్‌ఛార్జి ఎన్నికల అధికారి కేతన్‌ గార్గ్‌ చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు గురువారం రాత్రి కలెక్టర్‌ జిల్లాకు చేరుకున్నారు. నూతన కలెక్టర్‌కు ఇన్‌ఛార్జి కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, డిఆర్‌ఒ రామకృష్ణారెడ్డి పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ అనంతరం జిల్లా పరిషత్‌ సీఈవో వైఖోమ్‌ నిదియా దేవి, నగరపాలక సంస్థ కమిషనర్‌ మేఘస్వరూప్‌ తదితర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

➡️