నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

నామినేషన్ల స్వీకరణకు సంబంధించి కళ్యాణదుర్గంలో అధికారులతో సమీక్షిస్తున్న కళ్యాణదుర్గం ఆర్వో రాణి సుస్మిత

          కళ్యాణదుర్గం : అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు సంబంధించి నామినేషన్‌ స్వీకరణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని కళ్యాణదుర్గం ఆర్వో రాణి సుస్మిత తెలియజేశారు. బుధవారం స్థానిక రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో డిఎస్‌పి బి.శ్రీనివాసులతో కలిసి సమీక్ష నిర్వహించారు. గురువారం నాడు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో పాటు ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనల మేర దరఖాస్తులను సంపూర్తి చేసి నేరుగానైన లేక ఏజెంట్‌ ద్వారానైనా సమర్పించేందుకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించిందన్నారు. మూడు గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా దరఖాస్తులు స్వీకరించమన్నారు. సమావేశంలో సిఐలు ఎస్‌ఐలు ఏఈఆర్వోలు, తహశీల్దార్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

➡️