అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మానూరు జయరామ్‌

ప్రజాశక్తి-గుంతకల్లు

టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరామ్‌ అన్నారు. శనివారం పట్టణంలోని 13వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సంక్షేమం కూడా అరకొరగానే అందించారన్నారు. ఈ ఎన్నికలు చంద్రబాబు కోసం కాదని.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు అన్నారు. నెలరోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకూ సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ అనురాధ, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.గుత్తి : ఎన్‌డిఎ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరామ్‌ను ఆదరించాలని ఆయన సోదరుడు, ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు మహేంద్ర కోరారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 16, 17వ వార్డుల్లో ఆయా వార్డుల టిడిపి ఇన్‌ఛార్జిలు ఎస్‌ఎం బాషా, సరోజతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పి.రవితేజ, ఎన్‌.కేశవనాయుడు, ఎంకే.చౌదరి, పిల్లేల్లి కృష్ణయ్య, జక్కలచెరువు ప్రతాప్‌, కరిడికొండ సూరి, మాజీ కౌన్సిలర్‌ కె.గోవిందు, నబిరసూల్‌పాల్గొన్నారు. పామిడి : మండలంలోని ఓబులాపురం, ఖాదరపేట గ్రామాల్లో టిడిపి నాయకులు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరామ్‌ కుమారుడు ఈశ్వర్‌ ఇంటింటికీ వెళ్లి టిడిపికి ఓటు వేసి చంద్రబాబును సిఎంను చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ వైసిపి దుష్టపాలన పోవాలంటే అందరం కలిసికట్టుగా పని చేయాలన్నారు. ముఖ్యంగా టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలందరూ క్రియాశీలకంగా పని చేసి గుమ్మనూరు జయరామ్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ కార్యకర్త లక్ష్మీకాంతమ్మ, తెలుగుదేశం, బిజేపి, జనసేన కార్యకర్తలు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

➡️