నిరంతరం అప్రమత్తంగా ఉండాలి : డీఎస్పీలు

నిరంతరం అప్రమత్తంగా ఉండాలి : డీఎస్పీలు

సిబ్బందితో మాట్లాడుతున్న డీఎస్పీలు

అనంతపురం క్రైం : జిల్లాలోని ఇవిఎంలను భద్రపరిచిన జెఎన్‌టియు స్ట్రాంగ్‌ రూముల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అనంతపురం డీఎస్పీ టి.వి.వి ప్రతాప్‌, ఏ.ఆర్‌ డీఎస్పీ మునిరాజ సంబంధిత గార్డులను ఆదేశించారు. గురువారం స్థానిక జెఎన్‌టియు స్ట్రాంగ్‌ రూములను వన్‌టౌన్‌ సి.ఐ రెడ్డెప్పతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈ స్ట్రాంగు రూమ్‌ల వద్ద సాయుధ పోలీసులతో గార్డులు నిర్వహిస్తూ నిరంతర భద్రతను పరిశీలించారు. అంతేకాకుండా స్ట్రాంగు రూంల పరిసరాలలో ఫుట్‌ పెట్రోలింగ్‌, వజ్ర వాహనం ద్వారా గస్తీ కొనసాగిస్తున్నారు. సి.సి కెమేరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగు ముగిసే వరకు పటిష్ట భద్రత కొనసాగించాలని డీఎస్పీలు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని ఆదేశించారు.

➡️