పేదల మనిషి ఫాధర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌

ఫెర్రర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌

           అనంతపురం కలెక్టరేట్‌ : పేద ప్రజల అభ్యున్నతి కోసం అనునిత్యం తపించిన వ్యక్తి ఫాదర్‌ ఫెర్రర్‌ అని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ తెలిపారు. బుధవారం నాడు ఫాదర్‌ ఫెర్రర్‌ 15వ వర్థంతిని పురస్కరించుకుని అనంతపురం కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న ఫెర్రర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఫాదర్‌ఫెర్రర్‌ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. నిరుపేదలకు సేవలు అందించే విధంగా ఆర్డీటీ సంస్థను ఫాదర్‌ ఫెర్రర్‌ నెలకొల్పారన్నారు. పేదల విద్య, వైద్యం కోసం ఆయన ఎంతో శ్రమించారన్నారు. ఫాదర్‌ ఫెర్రర్‌ భౌతికంగా లేకపోయినా.. ఆ సేవలు ఇప్పటికీ ఆర్డీటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుగ్గయ్య చౌదరి, పార్లమెంట్‌ మీడియా కోఆర్డినేటర్‌ కూచి హరి, తెలుగుయువత నాయకుడు లింగారెడ్డి, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీనరసింహులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నెట్టెం బాలకృష్ణ, వెంకటేశ్వర రెడ్డి, చేపల హరి, గూడిపూటి సురేష్‌ చౌదరి, ఓంకార్‌ రెడ్డి పాల్గొన్నారు.

జిల్లా గ్రంథాలయంలో..

         అనంతపురం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌కు నివాళులు అర్పించారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రమ, ఫెరర్‌ చిత్ర పటానికి పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది సి.ఇంతియాజ్‌ అహ్మద్‌, రామంజినమ్మ, హేమమాలిని, శ్రీవిజయ, నాగమణి, సరస్వతమ్మ, ఉజ్జినేశ్వరి, గంగాధర్‌ పాల్గొన్నారు.

➡️