చదువుకు ప్రభుత్వ ప్రోత్సాహం

పాఠశాలలో మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ

       బుక్కరాయసముద్రం : విద్యార్థుల చదువుకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుందని దానిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని కొర్రపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్‌ కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. బడి బయట ఉండే పిల్లలందరినీ బడిలో చేర్పించాలని ఉపాధ్యాయులు, గ్రామస్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దాసరి సునీత, తహశీల్దార్‌ హనుమాన్‌ నాయక్‌, ఎంఇఒ లింగానాయక్‌ పాల్గొన్నారు.

➡️