మేనిఫెస్టో తర్వాత రెట్టింపైన ప్రజాస్పందన

మేనిఫెస్టో తర్వాత రెట్టింపైన ప్రజాస్పందన

హోటల్‌ నిర్వాహకులను ఓటు అభ్యర్థిస్తున్న దగ్గుపాటి ప్రసాద్‌

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

ఎన్‌డిఎ కూటమి ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోతో ప్రజాస్పందన రెట్టింపు స్థాయిలో కనిపిస్తోందని అనంతపురం అర్బన్‌ టిడిపి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. గురువారం నగరంలోని 10వ డివిజన్‌ రాణీనగర్‌లో మాజీ కార్పొరేటర్‌ పావురాల చంద్రశేఖర్‌ ఆధ్వర్యం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా కూటమి నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలతోపాటు టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో తర్వాత తాము అనంతపురం అర్బన్‌తో పాటు జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా పింఛన్లు రూ.4వేలకు పెంపు, బీసీలకు ఇవ్వనున్న అవకాశాలు, డీఎస్పీపై తొలి సంతకం వంటి వాటిపై మంచి స్పందన వస్తోందన్నారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు నగరాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై స్పష్టమైన ఆలోచనతో ఉన్నామన్నారు. తనను ఆదరించి అసెంబ్లీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ స్వరూప, తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజశ్విని, కంఠాదేవి, రాయలసీమ బలిజ యువజన సంఘ యువజన అధ్యక్షుడు తొండపాటి రమేష్‌, మాజీ కార్పొరేటర్‌ వడ్డే భవాని, రవి, ఆర్టీసీ చంద్ర, ఈశ్వరయ్య, చికెన్‌ నారాయణస్వామి, మున్వర్‌, మసూద్‌, సురేష్‌, ఆది, రమాదేవి, రాణి, గుర్రం నాగభూషణం, పామురాయి వెంకటేష్‌, డేగల కృష్ణమూర్తి, జనసేన నాయకుడు జయరామిరెడ్డి, కృష్ణ, సత్తి, మంజు, రాజా, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️