వాలంటీర్ల రాజీనామా

వాలంటీర్ల రాజీనామా

విడపనకల్లు మండలంలో రాజీనామా పత్రాలను అందజేస్తున్న వాలంటీర్లు

బెలుగుప్ప : మండల కేంద్రంలోని వాలంటీర్లు బుధవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా వారి రాజీనామా పత్రాలను ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ సుబ్బరాజు, పంచాయతీ సెక్రటరీ వెంకటేష్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా ఉంటూ సేవలందిస్తున్నామన్నారు. అలాంటి తమపై టిడిపి అధినేత చంద్రబాబు కక్ష సాధింపునకు దిగడం బాధాకరమన్నారు. అందువల్లే రాజీనామా చేసినట్లు తెలిపారు.

ఉరవకొండ : విడపనకల్లు మండలంలో వాలంటీర్లు బుధవారం మూకమ్మడిగా రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా ప్రతులను ఎంపిడిఒ కొండయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ వాలంటీర్లపై టిడిపి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. టిడిపి తీరును నిరసిస్తూ రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా చేసిన వారిలో గడేకల్‌, విడపనకల్‌, కరకముక్కల, వి.కొత్తకోట చీకలగురికి, ఉండబండ తదితర గ్రామాల వాలంటీర్లు ఉన్నారు.

➡️