ప్రజాశక్తి వార్తకు స్పందన

ప్రజాశక్తి వార్తకు స్పందన

సంప్రదాయ రంగుల్లో జంట ఆలయాలు

ప్రజాశక్తి-నార్పల

మండల పరిధిలో ని గూగూడు గ్రామంలో మత సామరస్యానికి ప్రతీకగా వెలసిన కుళ్లాయిస్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలకు సంప్రదాయ రంగులు వేశారు. ప్రజాశక్తి దినపత్రికలో ‘గూగూడులో మరోసారి రంగుల రాజకీయం జరిగేనా’ అన్న కథనం గురువారం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన జంట ఆలయాల ఇఒ శోభ గురువారం దగ్గరుండి ఆలయానికి సంప్రదాయ రంగులను వేయించారు. గతంలో కుళ్లాయిస్వామి ఆలయానికి వేసిన రంగుల విషయంలో గ్రామంలో పెద్దస్థాయిలో వివాదం చెలరేగింది. ఈనేపథ్యంలో త్వరలో ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గతాన్ని పోలుస్తూ ప్రజాశక్తితో కథనం ప్రచురితమైంది. దీంతో వెంటనే స్పందించిన ఇఒ దగ్గరుండి సంప్రదాయ రంగులను వేయించారు. ఆలయాలకు సంప్రదాయ రంగులు వేస్తుండడంతో గ్రామస్తులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

➡️