జిల్లా రైతాంగాన్ని ఆదుకోండి

కరువు బృందంకు నాయకత్వం వహించిన రితీష్‌ చౌదరితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌

         అనంతపురం కలెక్టరేట్‌ : కరువుతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న అనంతపురం జిల్లా రైతులను ఆదుకోవాలని అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ కేంద్ర కరువు బృందం సభ్యులను కోరారు. ఉమ్మడి రబీ కరువు పరిస్థితుల పరిశీలన నిమిత్తం వచ్చిన ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీం లీడర్‌ రితేష్‌ చౌహాన్‌, కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ను బుధవారం నాడు రెవెన్యూ భవన్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. పంట నష్టంపై అన్ని అంశాలు పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

➡️